*మై హోం కు శక్తి పరిరక్షణ యూనిట్ గా అవార్డ్

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్ *)

స్థానిక మై హోం సిమెంట్ పరిశ్రమ కి శక్తి పరిరక్షణ సామర్థ్యం గల యూనిట్ గా అవార్డ్ వరించింది. బుధవారం సాయంత్రం ఢిల్లీ లో కాన్ఫిడారేషన్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన 23 జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో 2022 సంవత్సరం గాను పవర్ మినిస్ట్రీ సెక్రెటరీ అర్.కే.రాయ్ చేతుల మీదుగా పరిశ్రమ యూనిట్ హెడ్ శ్రీనివాస రావు ఈ అవార్డ్ అందుకున్నారు.

 

ఈ సందర్భంగా ప్లాంట్ హెడ్ శ్రీనివాస రావు మాట్లాడుతూ విద్యుత్,బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తూ ఉత్పాదన మెరుగు పరుస్తూ పరిశ్రమ అనేక చర్యలు తీసుకోవడం వల్ల,అలాగే పరిశ్రమ యందు వ్యర్థ పదార్థాలను తగ్గించడం తో పాటు పర్యవరణమునకు హని కలగకుండా ఉత్తమ పద్ధతుల ద్వారా శక్తి వినియోగం తగ్గించడం వంటి చర్యలు చేపట్టినందుకు ఈ అవార్డ్ మై హోం పరిశ్రమ కు దక్కిందన్నారు. యాజమాన్యం ప్రోత్సాహం,ఉద్యోగుల సమిష్టి కృషి ఫలించింది అని తెలిపారు.