మొక్కజొన్న యంత్రం బోల్తా: ఇద్దరి మృతి
ఇల్లందు:ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లి సమీపంలోని పొలంలో మొక్క జొన్నలు వొలిచే యంత్రం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు హరీష్, కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్ డిగ్రీ చదువుతూ ఈ యంత్రం వద్ద ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. యంత్రం వద్ద పనిచేస్తున్న రవి, రామజోగయ్య, రామచంద్ర అనే ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరిలించారు.