మొక్కలను పెంచి పర్యావరణంను కాపాడండి, మున్సిపల్ చైర్మన్ పొగాకు సు ఖే షి నీ విశ్వేశ్వర్.
మొక్కలను పెంచి పర్యావరణం ను కాపాడాలని కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సు ఖే షి నీ విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు.కొత్తకోట మున్సిపాలిటి కేంద్రంలోని 9, 10వ వార్డులలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు.మున్సిపాలిటీ నుండి ప్రతి వార్డులో పర్యటించి ఇల్లు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి మూడు పండ్ల మొక్కలను,మరో మూడు పూల మొక్కలను అందజేస్తున్నామని ప్రతి ఒక్కరు తీసుకొని రాబోయే మూడు నెలల్లో ఇంటి ముందు పెంచి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారాన్ని దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు ఒక ఉద్యమంలో చేపడుతున్నామని మున్సిపాలిటీ నుండి ఇస్తున్న మొక్కలను నాటి ఆరోగ్యవంతమైన వాతావరణం సృష్టించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సభాధ్యక్షత వహించగా మున్సిపల్ వైస్ చైర్మన్ బీసం జయమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు ఎరుకలి తిరుపతయ్య,రామ్మోహన్ రెడ్డి,ఖాజ మైనోద్ధిన్,హోటల్ రాములు యాదవ్, చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి,చీర్ల నాగన్న సాగర్, సంధ్యా మన్యం యాదవ్,కో ఆప్షన్ సభ్యులు తహసీన్ సుల్తానా వహీద్ అలీ, మదనాపురం మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు న్యాయవాది యాదగిరి,తెరాస ఉద్యమ నేత చాంద్ పాషా,తెరాస నాయకులు వినోద్ సాగర్, మాధవ రెడ్డి,తెరాస పట్టణ మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ సాజిద్ అలీ,ఉపాధ్యక్షులు ఎండి మజీద్ ఖాన్,బ్రహ్మం,ఖదీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.