మొక్కలు నాటి నీరు పట్టిన్న ఎస్ఐ సాయన్న.

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని స్థానిక ఎస్ఐ సాయన్న అన్నారు.ఆదివారం రోజున మండలంలోని కుమారి గ్రామ పంచాయతీ పరిధిలోని కుఫ్టీ రోడ్డుకు సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్కు లో మొక్కలను గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. తదనంతరం ఎస్ఐకి శాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఆకుపచ్చని హరిత తెలంగాణకై పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షణకు కృషి చేయాలన్నారు.గతంలో నాటిన చెట్లను చూసి సంతోషించి అవి మహా వృక్షాలుగా మారి జీవకోటి మానవ మనుగడకు దోహదపడుతాయని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఎస్ఐ సాయన్న తోపాటు గ్రామస్తులు పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్ తర్నం సర్పంచ్ విశాల్ విడిసి చైర్మన్ నవీన్ సామాజిక కార్యకర్త కొయ్యడి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.