మొక్కల పెంపకం పై విద్యార్థులకు అవగాహన
నిజామాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారిన అమృత ఆధ్వర్యంలో పెర్కిట్ గ్రామానికి చెందిన మల్లయ్యస్ భరత్ చంద్ర పాఠశాల విద్యార్థులకు మామిడిపల్లి లోని అరణ్యంలో మొక్కల పెంపకం, వాటి వల్ల ఉపయోగలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినివిద్యార్థులు మాట్లాడుతూ హరితవనంలో భాగంగా మొక్కల పెంపకం, వాటి వల్ల ఉపయోగాలు, వాటి జీవితకాలం వివరాలు తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.అనంతరం పాఠశాల ఫీజిక్స్ ఉపాధ్యాయుడు దినేష్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, హరితవనం లాంటి కార్యక్రమాలు చేపట్టి అందులో విద్యార్థులను భాగ్యస్వాములను చేస్తూ, వారి విజ్ఞానాన్ని మెరుగు పరిచే దిశగా ముందుకు సాగుతు, ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశాల్లాలో విహరించే విధంగా చేయడం ఆనందకరమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారిని మాధవి, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు సత్తయ్య, రత్నయ్య,సౌమ్యలతో పాటు పాఠశాల ఉపాధ్యాయుడు వినోద్ పాల్గొన్నారు.
—————-