మొక్కల పెరుగుదల బాధ్యత మన అందరిదీ
జనం సాక్షి కథలాపూర్
మొక్కలు నాటడం కాదు దాని పెరుగుదల మన అందరి బాధ్యత అని మండల కేంద్రంలోని సర్పంచ్ కంటే నీరజా సత్యనారాయణ అన్నారు ఆదివారం మండల కేంద్రంలో మొక్కల పంపిణీ అదేవిధంగా వీధి వీధికి మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద ఒక మొక్క నాటుతున్నామని దానికి ట్రీ గార్డ్స్ కూడా అమర్చుతున్నాము. వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి కి ఉండాలని కోరారు. గ్రామపంచాయతీలో ఇప్పటివరకు 1000 కి పైగా మొక్కలు నాటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కల సంరక్షణ కొరకు వాల్టా చట్టాన్ని రూపొందించిందని, ఆ చట్టాన్ని గ్రామాల్లో అమలుపరచుదామని విజ్ఞప్తి చేశారు కావున ప్రతి ఒక్కరూ మొక్కలు ఎదుగుదలకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ గౌడ్, కరాబర్ ఇస్మాయిల్, సత్తయ్య, ఏఎన్ఎంలు అంగన్వాడి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు