మొదటి స్థానాన్ని నిలుపుకోవాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్
జగిత్యాల,అక్టోబర్ 28(జనంసాక్షి): పదోతరగతిఫలితాల్లో సాందించిన మొదటిస్థానాన్ని తిరిగి నిలుపు కోవాలని, అందుకు తగిన ప్రణాళికను రూపోందించుకుని ముందుకెల్లాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ అధికారులను ఆదేశించారు. గత మార్చిలో వందశాతం సాదించిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యా యుల, ఉపాధ్యాయుల అభినందన సభ ధర్మపురిలో జరిగింది. ఈసందర్బంగా కలెక్టర్ వారికి ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. అనంత రం కలెక్టర్‌మాట్లాడుతూ 103పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణ సాదించాయని ఇప్పటినుంచే కృషి చేస్తే అన్ని పాఠశాలల్లో వందశాతం సాదిం చవచ్చన్నారు. 60రోజుల
ప్రణాళిక రూపొందించుకుని మాదిరి ప్రశ్నాపత్రాలు రూపకల్పనచేశారని గెలుస్తాం నిలుస్తాం అనే ఆత్మవిశ్వాసంతో ముందుకెల్లాలని గెలుస్తామనే తపనఉంటే తప్పకసాదిస్తామన్నారు. విద్యాశాఖ సాధించిన నంబర్‌వన్ స్పూర్తితో మిగతా శాఖలు ప్రేర ణ పొందిఈరోజు స్వచ్చభారత్ రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ గొర్రెల అభివృద్ది పథకం హరితహారం తదితర కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో ఉందన్నారు.సబ్జెక్ట్ టీచర్‌లని గుర్తించి నియమించుకోవాలని నిధులు మంజూరు చేస్తానన్నారు. డిజిటల్ క్లాస్‌లు షెడ్యూల్ తయారు చేయాలన్నారు. అల్పాహారం మెనూ మండలంలోని అన్ని పాఠశౄలల్లో ఏకరూపంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిభనుబట్టి విద్యార్థులను గ్రూపులుగా విభజించి బోదన చేయాలన్నారు. విద్యాకర్థుల తల్లిదండ్రులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు, రోజు పాఠశాలకు హాజరయ్యేలా ఇంట్లో ¬ం వర్క్ చేసేలా అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో మౌళిక వసతులు మెరుగు పరు స్తామన్నారు. ప్రతి ఉపాద్యాయుడు పడుకునే ముందు ఈరోజు పిల్లలకు ఏం చెప్పాను వందశాతం ఉత్తీర్ణతకు ఏం కృషి చెస్తున్నానో ఆలో చించుకోవాలన్నారు. అనుకుంటే సాదించలేనిది ఏమిలేదని ఖచ్చితంగా సాదిస్తాననే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్ర మంలో డీఈఓ వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారులు ప్రధానోపాద్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.