మొబైల్‌ జదభద్రం`

 

కరోనా వ్యాప్తికి ఫోను కూడా కారణం

న్యూదిల్లీ,మే 15(జనంసాక్షి):కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మనం ముఖానికి మాస్క్‌ ధరిస్తున్నాం.. చేతుకు హ్యాండ్‌ శానిటైజర్‌ వాడుతున్నాం.. బయటకు వెళ్లి ఇంటికి వస్తే కాళ్లూ చేతు, అవసరమైతే తస్నానం చేస్తున్నాం. మరి మనం వాడే మొబైల్‌. దీన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తికి మొబైల్‌ ఫోన్లు వాహకాుగా పని చేస్తున్నాయా? అంటే ఎయిమ్స్‌ డాక్టర్లు అవుననే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆస్పత్రుల్లో పనిచేసేవారు అక్కడకు మొబైల్‌ ఫోన్లను తీసుకెళ్లపోవడమే శ్రేయస్కరం అని చెబుతున్నారు.ముఖం, నోటి నుంచి నేరుగా మొబైల్‌ ఫోన్‌ ఉపరితం పైకి వైరస్‌ వచ్చి చేరుతున్నట్లు గుర్తించారు. తరచూ చేతు శుభ్రం చేసుకుంటున్నా, సగటున మొబైల్‌ వినియోగం ఎక్కువగా ఉండటంతో వైరస్‌ వ్యాప్తి కూడా అందుకు తగినట్లే ఉందని చెబుతున్నారు. కరోనా నివారణకు డబ్ల్యూహెచ్‌వో సహా అనేక సంస్థు మార్గదర్శకాను విడుద చేశాయి. అయితే, అవేవీ మొబైల్‌ ఫోన్‌ వినియోగంపై పెద్ద దృష్టి పెట్టలేదు. చేతు శుభ్రంగా ఉంచుకోవాని తెలియజేశాయి కానీ, మొబైల్‌ను శుభ్రంగా ఉంచుకోవాని మాత్రం చెప్పలేదని ఎయిమ్స్‌ వైద్యు చెబుతున్నారు.