మొబైల్ చార్జింగ్ పెడుతుండగా మహిళా మృతి
మల్దకల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) మొబైల్ ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ గురై జ్యోతి (25)మహిళ మృతి చెందిన సంఘటన బిజ్వారం గ్రామంలో చోటు చేసుకున్నది.వ్యవసాయ పొలం దగ్గర భార్యాభర్తలుగుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు.వంట చేసుకొని శుక్రవారం తెల్లవారుజామున మొబైల్ ఫోన్ కుచార్జింగ్ పెడుతుండగా షాక్ గురై చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఏ ఎస్ ఐ ఈశ్వరయ్య తెలిపారు.తల్లి శంకరమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ఎంపీపీ వై రాజారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం పరంగా కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.