మోటకొండూరులో 30 పడకల ఆసుపత్రిని నిర్మించిన వర్తుసా ఫౌండేషన్

ఖైరతాబాద్ ;  ఆగస్ట్ 13 (జనం సాక్షి) డిజిటల్ బిజినెస్ స్ట్రాటజీ, డిజిటల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సేవలు, పరిష్కారాలను అందించే గ్లోబల్ ప్రొవైడర్ అయిన వర్తుసా కార్పొరేషన్ సీఎస్ఆర్ విభాగం వర్తుసా ఫౌండేషన్ 30 పడకల నిర్మాణానికి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌తో చేతులు కలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు పిహెచ్‌సిలో ఆసుపత్రి సౌకర్యం, స్థానికంగా వైద్య మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, చికిత్స ఆలస్యం కావడం వల్ల ప్రాణ నష్టం, ఇన్‌ఫెక్షన్, వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, స్థానిక నివాసితుల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ పీహెచ్సీ వద్ద యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మద్దతుతో వర్తుసా 30 పడకల ఆసుపత్రి సౌకర్యాన్ని నిర్మించింది. వర్తుసా సీఎఫ్ఓ అమిత్ బజోరియా, ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి మల్లికార్జునరావు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ నుండి సీఈఓ రేఖా శ్రీనివాసన్ ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.