మోడల్ స్కూల్, కేజీబీవీ సమస్యలు పరిష్కరించాలి.
– టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జి తిరుపతి రెడ్డి.
దుబ్బాక 06, ఆగష్టు ( జనం సాక్షి )
సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ దుబ్బాక మండల శాఖ అధ్యక్షులు బి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం- టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జి తిరుపతి రెడ్డి.
దుబ్బాక 06, ఆగష్టు ( జనం సాక్షి )
సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ దుబ్బాక మండల శాఖ అధ్యక్షులు బి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రోజు మోడల్ స్కూల్,కేజీబీవీ పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి వారి యొక్క సమస్యలు సేకరించడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జి తిరుపతి రెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 317 జీవో వర్తింపజేయాలని మరియు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని మరియు ఖాళీ పోస్టులను నూతన నియామకాల ద్వారా భర్తీ చేయాలని తాత్కాలికంగా విద్యావాలంటీర్లను ఇచ్చి విద్యావ్యవస్థను పరిరక్షించాలని పర్యవేక్షక పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు అందించాలని పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కార్యదర్శి జి జానకి రాములు, జిల్లా ఉపాధ్యక్షులు ఏ నరసింహారెడ్డి, జిల్లా అకాడ మిక్ సెల్ కన్వీనర్ సాదత్ ఆలీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి సీనియర్ నాయకులు జయాకర్ రెడ్డి, దుబ్బయ్య,నరేష్, మహేష్, శ్రీకాంత్,శివరాజం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.