మోడీకి వంతపాడిన కెసిఆర్‌

జితిన్‌ ప్రసాద్‌ ఆరోపణ
హైదరాబాద్‌, డిసెబర్‌1(జ‌నంసాక్షి): మోదీతో కేసీఆర్‌ కుమక్కయ్యారని కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద్‌ ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ మోదీ బడా బాయ్‌..కేసీఆర్‌ చోటా బాయ్‌ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తోందన్నారు. డీజిల్‌, పెట్రోల్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం వ్యాట్‌ ఎందుకు తగ్గించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలపై భారం పడుతున్నా కేసీఆర్‌కు పట్టదని జితిన్‌ ప్రసాద్‌ విమర్శించారు. జిఎస్టీకి మద్దతు ఇచ్చింది నిజం కాదా అని అన్నారు. అన్నిరకాలుగా మోడీకి అండగా నిలుస్తూ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. ఇదిలావుంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని కర్ణాటక పీసీసీ చీఫ్‌ ఈశ్వర్‌ కాండ్రే అన్నారు. శనివారం గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హావిూని కేసీఆర్‌ నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్‌ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఎన్డీయే పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఈశ్వర్‌ కాండ్రే స్పష్టం చేశారు.