మోడీపట్ల మునుపటి ఆరాధ్యభావం ఏదీ

పార్టీలనూ పెదవి విరుస్తున్న నేతలు?
ఏకపక్ష నిర్ణయాలపైనా పార్టీలో ఆందోళన
న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశంలో నిరసనలు సుదీర్ఘంగా జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరిసనలు, ఆందోళనల ద్వారా ప్రజలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా గత ఆరేడు నెలలుగా రైతు ఉద్యమాలు వివిధ రూపాల్లో సాగుతున్నా ప్రభుత్వం నిరంకుశంగానే ఉంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఆందోళనలను మోడీ ప్రభుత్వం అస్సలు ఖాతరు చేయడం లేదు. వివాక ఉక్కును పరిరక్షించాలని ఉద్యమిస్తున్నా పెద్దగా పట్టించుకోడం లేదు. అలాగే అమరావతిలో రాజధాని కోసం జరుగుతున్న రైతు ఆందోళనలను కూడా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తరవాతి కాలంలో నిరంకుశంగా మారుతున్నాయి. దేశంలో అనేకానేక అంశాల్లో వ్యతిరేకతలు, ఆందోళనలు వస్తున్నాయి. ప్రధానంగా కార్పోరేటీకరణ, బడా నేతలకు అండగా నిలవడం వంటి అంశాల విశయంలో బిజెపిలో కూడా అంతర్గతంగా చర్చ సాగుతోందని సమాచారం. నిరంకుశ విధానాలను పార్టీలో పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీకి కూడా అంతర్గతంగా సమస్యలు లేవని కానీ..మొదలు కాలేదని కానీ చెప్పలేం. బహుశా పార్టీలో, ప్రభుత్వంలో పట్టు బిగించేందుకే ఆయన కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపి వివిధ వర్గాలకు స్థానం కల్పించాల్సి
వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో యోగి అదిత్యనాథ్‌ను కదపాలని ఒక దశలో ఆలోచించి వెనక్కు తగ్గారని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు యోగి అద్భుతంగా పాలిస్తున్నారని ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే కర్ణాటకలో తప్పనిసరై యడ్యూరప్ప అనుయాయుడినే ముఖ్యమంత్రిగా నియమించాల్సి రావడం మోడీ బలహీనత తప్పమరేవిూ కాదు. అంతమాత్రాన కర్ణాటకలో ఆ పార్టీ అధికారం నిలబెట్టుకోగలుగుతుందా అన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఇప్పుడున్న అధికారం కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్ల వచ్చిందే కాని సహజంగా వచ్చింది కాదు. కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవడం మాత్రమే కాదు, దక్షిణాదిన మిగతా రాష్టాల్లో కూడా బిజెపి ప్రవేశించే అవకాశాలు అతి కష్టంగా మారాయి. ఎపిలో విశాఖ స్టీలు, రాజధాని అంవాలు గుదిబండగా మారనున్నాయి. ప్రజా ఉద్యంతో ఏర్పడ్డ ఇశాఖ స్టీలు అమ్మకం అన్నది మోడీకి కొరివితో తలగోక్కోవడం తప్ప మరోటి కాదు. అలాగే రాజధాని విషయంలో జగన్‌ మొండి వైఖరిని ఎండగట్టాల్సిన బిజెపి చడీచప్పుడు కాకుండా విశృాఖ ను అమ్మించుకునేందుకు ఆయనతో లోపాయకారి అవగాహనకు వచ్చిందని అంటున్నారు. ఇతర రాష్టాల్లో అధికారం స్థిరంగా ఉండాలంటే కూడా బిజెపి అధిష్ఠానం ఎన్నో ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. మోదీ సారథ్యంలోని కేందప్రభుత్వ విధానాలవల్ల పెద్దఎత్తున ఊపు వచ్చి జనం ఓటు వేసే పరిస్థితులు లేవు. అలాగే మోడీపైనా భ్రమలు తొలిగిపోయాయి. ప్రజలకే కాకుండా బిజెపి నాయకులకు కూడా మోడీపట్ల మునుపు ఉన్నంతగా ఆరాధ్య భావం లేదనే చెప్పాలి. ఆయన ప్రతిభ రోజురోజుకూ తగ్గిపోతున్నదని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. ఆయన ఉపన్యాసాలు కూడా గతంలో లాగా ఆకట్టుకోకపోగా, సోషల్‌ విూడియాలో వ్యతిరేక వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనం చేసే ఆందోళనలే ప్రతిపక్షాలకు ఊతం ఇస్తాయి. ఏ ప్రతిపక్షం అండ లేకుండా రైతులు ఇన్నాళ్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా వారు పోరాడుతున్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు అభద్రతలో పడ్డారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఆందోళన చేసిన వందలాది ఉద్యోగుల్లో ఈ అభద్రత మరింతగా కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరగడాన్ని బిజెపి నేతలు కూడా సమర్థించుకోలేకపోతున్నారు.