మోతీరాం గుడా సమస్యలు పరిష్కరించాలి.
ఎంపీపీ కి వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు.
జనం సాక్షి ఉట్నూర్.
సాలెవాడా బి గ్రామ పంచాయతీ పరిధిలోని మోతీరాంగుడ ప్రజలు బుధవారం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ పంద్ర జై వంత్ రావు ను కలిసి గ్రామంలో రోడ్డు సైడ్ డ్రైనేజీ సమస్యలను పూర్తి చేయాలని గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాలని గ్రామస్తులు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మోతీరాం గూడా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చేస్తానని ఈ సమస్యల కొరకు ఎమ్మెల్యే ని మారుతి కూడా కి తీసుకొని వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మేస్రం సీతారాం ఆత్రం మోతిరాం మెస్రం సోనేరావు గెడం ఇశ్వర్ దేవరావు పరమేశ్వర్ గోపాల్ దినేష్ తిరుపతి జలింధర్ ఇంద్ర శ్రీరామ్ రాంశావ్ తదితరులు ఉన్నారు.