మౌలిక వసతుల కల్పనలో పేట మున్సిపాలిటీ ముందంజ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో సూర్యాపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బుధవారం పట్టణ ప్రజల సౌకర్యార్థం మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నూతనంగా రూ.50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఐదు ట్రాక్టర్లను ఆమె ప్రారంభించి మాట్లాడారు.జిల్లా కేంద్రంలో ప్రతిరోజు 70 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అన్నారు.ఇప్పటికే 14 ట్రాక్టర్లు ఉన్నప్పటికీ సరిపోకపోవడంతో మరో ఐదు ట్రాక్టర్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.రెండు ట్రాక్టర్లను హరిత హారం మొక్కలకు నీళ్లు పోసేందుకు,రెండు ట్రాక్టర్లను చెత్త కోసం, ఒకటి డ్రిల్లింగ్  కొరకు వాడకంలోకి తేనున్నట్లు తెలిపారు.ప్రజలంతా మున్సిపాలిటీ వారికి సహకరిస్తూ, తడి పొడి  చెత్తలను వేరుచేసి మున్సిపల్ ట్రాక్టర్లకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి , కౌన్సిలర్స్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున ,చింతలపాటి భరత్ మహాజన్,ఈఈ జికేడి ప్రసాద్ , డిఇ సత్యారావు,వాటర్ సప్లై వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.