మ్యానిఫెస్టో చూసి అనేకులు టీఆర్‌ఎస్‌లో చేరిక

టీఆర్‌ఎస్‌ జగిత్యాల అభ్యర్థి సంజయ్‌కుమార్‌

జగిత్యాల,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, టీఆర్‌ఎస్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని జగిత్యాల టిఆర్‌ఎస్‌ అభ్యర్తి డా. సంజయ్‌కుమార్‌ అన్నారు. దీంతో తమకు మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో రాష్ట్రంలోని సబ్బండ వర్గాల మన్నలు పొందిందని పేర్కొన్నారు. బడుగు బలహీనవర్గాల, మైనార్టీ,
గిరిజనుల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు టీఆర్‌ఎస్‌ పాక్షిక మ్యానిఫెస్టో భరోసానిస్తుందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 11వేల మెట్రి క్‌ టన్నుల గోదాములను నిర్మించామన్నారు. జగిత్యాల మండలంలోని పొలాస గ్రామంలో విత్తన శుద్ది, సీడ్‌ ప్రాసెసింగ్‌
యూనిట్‌కు నిధులు మంజూరు చేసి టెండర్‌ పక్రియ దశ ముగిసిందన్నారు. 40 ఏండ్లలో జరుగని అభివృద్ది నాలుగేండ్లలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేసి చూపెట్టిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దళితులు, గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధిపొందని కాం గ్రెస్‌
నాయకులు లేరనీ, ప్రాజెక్టులను అడ్డుకునే పార్టీతో జతకట్టారని పేర్కొన్నారు.