యశ్వంతపూర్ వద్ద విరిగిన రైలు పట్టా
వరంగల్: జిల్లాలోని జనగాం మండలం యశ్వంతపూర్ వద్ద రెండు అంగుళాల మేర రైలు పట్టా విరిగిపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన రైల్వే సిబ్బంది తక్షణమే విరిగిన రైలు పట్టాకు మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల కారణంగా సికింద్రాబాద్- కాజీపేట మధ్యరైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.