యాత్రికులకుభజ్జీ ధైర్యవచనాలు

డెహ్రడూన్‌: భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కౌన్సిలర్‌ అవతారమెత్తాడు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) సిబ్బందితో కలసి వరదల్లో చిక్కుకుపోయిన యాత్రికులు, పర్యటకులను కలుసుకున్నాడు. శిబిరాల్లో ఉన్న వారిలో ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నించాడు. ”హర్భజన్‌ వారికి హితబోధ చేశాడు. త్వరాలోనే అంతా చక్కబడుతుందని చెప్పాడు. మాతో పాటు వారికి ఆహారం, నీళ్లు అందించాడు. వారితో గడిపాడు” అని ఐటీబీపీ అధికారి ఒకరు చెప్పారు. హర్భజన్‌ మూడు రోజులుగా శిభిరంలో ఉంటున్నాడు.