యాభై వేల రూపాయలు రుణం అందించాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ డిమాండ్

జనం సాక్షి,చెన్నారవు పేట

ప్రాథమిక సహకార సంఘంలోని రైతులందరికీ 2018 ఎన్నికల ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక 50 వేల రుణమాఫీ చేసి ఇప్పుడేమో రైతుల వద్ద మిత్తి వసూలు చేస్తుందని అన్నారు.50 వేలకు మిత్తి ప్రభుత్వమే చెల్లించాలని అదనంగా రైతులకు 50 వేల రూపాయలు రుణం అందించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బాగంగా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక విడతల వారిగా రుణమాఫీ చేస్తున్నదని, ఇలా చేయడం సరికాదని, ఇప్పుడు రైతులకు 50 వేల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతు దగ్గర 50 వేలకు మిత్తి సుమారు 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు..రైతులు ఒక రూపాయి కూడా కట్టరని ప్రభుత్వమే 50 వేల రూపాయల రుణం అందించాలని డిమాండ్ చేశారు.గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సారి రుణమాఫీ చేసిందని,రానున్న 12 నెలల్లో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుందని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం ఎం చేస్తోందో రైతులు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,మండల ఉపాద్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య,సర్పంచ్ భద్రు నాయక్, ఉప సర్పంచ్ భూక్య శోభన్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్,గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సు నాయక్,బాణోత్ రమేష్నాయక్,హనుమ నాయక్,వార్డ్ సభ్యులు భూక్య మోహన్,రైతు గ్రామ శాఖ అధ్యక్షులు సూర్య,బాణోత్ లింబా,జాటోతు నందా తదితరులు పాల్గొన్నారు.