యాషెస్ సీరిస్‌లో 425 పరుగుల చేసిన ఆస్టేల్రియా
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 220/2 స్కోరు
బ్రిస్బేన్,డిసెంబర్10(జనం సాక్షి ): యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్టేల్రియా జట్టు భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఆసీస్ బౌలర్లు కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్టేల్రియా జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (94), మార్నస్ లబుషేన్ (74), ట్రావిస్ హెడ్ (152) రాణించడంతో 425 పరుగులు చేసి ఆలౌటయింది. 278 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ గట్టి పోటీనిస్తోంది. ఓపెనర్లు హసీబ్ హవిూద్ (27), రోరీ బర్న్స్ (13) మరోసారి నిరాశపరిచారు. అయితే కెప్టెన్ జోరూట్ (86 నాటౌట్), డేవిడ్ మలన్ (80 నాటౌట్) రాణించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 220/2 స్కోరుతో నిలిచింది. ఆసీస్ కన్నా 58 పరుగులు వెనుకబడి ఉంది. బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్టేల్రియా భారీ అధిక్యం సాధించింది. తొలి రోజు ఇంగ్లండ్‌ను 147 పరుగులకే కుప్పకూల్చిన ఆసీస్.. గురువారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ (95 బంతుల్లో 112 బ్యాటింగ్Ñ 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగితే.. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (94Ñ 11 ఫోర్లు, 2 సిక్సర్లు), లబుషేన్ (74Ñ 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌సెంచరీలు నమోదు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్ 3 వికెట్లు పడగొట్టాడు. చేతిలో మూడు వికెట్లు ఉన్న ఆస్టేల్రియా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కన్నా 196 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. హెడ్‌తో పాటు స్టార్క్ (10) క్రీజులో ఉన్నాడు. గబ్బా వంటి పేస్ పిచ్‌పై అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌కు తుది జట్టులో చోటు కల్పించకుండా మ్యాచ్‌కు ముందే తప్పు చేసిన ఇంగ్లండ్.. టాస్ గెలిచిన తర్వాత ప్రత్యర్థికి బంతినిచ్చినందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. బుధవారం కంగారూ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై.. రెండో రోజు ఇంగ్లిష్ పేసర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ నో బాల్స్‌తో విసిగించాడు. స్టోక్స్ బౌలింగ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ ఔటైనా.. అది నోబాల్ అని తేలడంతో డేవిడ్ బతికిపోయాడు. కాగా.. మొదటి సెషన్‌లో స్టోక్స్ మొత్తం 14 నోబాల్స్ వేసినట్లు ప్రసారకర్తలు పేర్కొనగా.. అంపైర్లు మాత్రం వాటిలో రెండిరటిని మాత్రమే నోబాల్స్‌గా ప్రకటించారు. తొలి రోజే ప్రత్యర్థికి ఆధిక్యం సాధించే అవకాశం ఇచ్చిన ఇంగ్లిష్ ఆటగాళ్లు ఫీల్డింగ్‌లోనూ పదే పదే తప్పిదాలు చేశారు. దీంతో రెండు సార్లు బతికిపోయిన డేవిడ్ వార్నర్ జట్టుకు బలమైన పునాది వేయగా..ట్రావిస్ హెడ్ చక్కటి ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు ఆధిక్యాన్ని అందించాడు.