యుఎఇ నుంచి,40,000 మంది భారతీయుల తిరిగి రాక
యుఎఇ గురువారం 15 (జనంసాక్షి):
యుఎఇ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టటంతో సుమారు 40,000 మంది అక్రమ వలసదారులు భారత్‌కు తిరిగి రానున్నారు. డిసెంబర్ 4 నుంచి రెండు నెలలు పాటు వీరు జరిమానాలు చెల్లించనక్కరలేదు. చట్టబద్దంగా అక్కడకు వెళ్లి విసా గడువు ముడిసినా అక్కడే ఉండిపోయిన వారికి ఈ క్షమాభిక్ష వర్తిస్తుందని అక్కడి అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ కమిటీ’ అధ్యక్షుడు కె.కుమార్ మాట్లాడుతూ యఎఇ ప్రభుత్వ నిర్ణయానికి హర్షం ప్రకటించారు. ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భారతీయ వర్గాలను కోరనున్నట్లు వెల్లడించారు. ఇక్కడే ఉండిపోయిన సుమారు 40,000 మంది క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కుమార్ చెప్పారు. ఆ మేరుకు భారత్ దౌత్యకార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలినపారు. భారత్ కాన్సలేట్ వద్ద ప్రత్యేక కేంద్రాలు తెరచి దరఖాస్తుదారులకు సాయం చేస్తారు. అక్రమంగా ఇక్కడే ఉండిపోయిన వారికి ఇదే ఆఖరు అవకాశమని అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. రెండు నెలల వ్యవధిని కొడిగించే అవకాశం లేదని తెలిపింది.