యువతకు స్ఫూర్తిదాయకుడు అబ్దుల్ కలాం

–బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం

తిమ్మాపూర్, అక్టోబర్ 15 (జనం సాక్షి): చిన్న వయస్సునుండి కష్టపడి చదువుకొని శాస్త్రవేత్త గా ఎదిగి భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిన గొప్ప వ్యక్తి ఏపిజే అబ్దుల్ కలాం అని కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రం లో బిజెపి మండలశాఖ ఆధ్వర్యంలో కలాం జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ రాష్ట్రపతిగా కలాం చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రపతి గా కలాం ను నియమించడం లో బిజెపి పాత్రను వివరించారు.రక్షణ రంగంలో కలాం చేసిన కృషి వల్ల భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,జిల్లా ఈసీ మెంబర్ బూట్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్,గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,ఉపాధ్యక్షులు వైద్యుల వెంకట్ రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బోనాల మోహన్,ఓబీసీ మోర్చా జిల్లా ఈసీ మెంబర్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,దళిత మోర్చా అధ్యక్షులు ఎల్కపల్లి స్వామి,ఉపాధ్యక్షులు ఉప్పులేటి జీవన్,చిరంజీవి,నేరెళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.