యువత ఆనందం… రైతులకు శాపం
– మద్యం సేవించి పొలాల్లో సీసాలు
పగలగొడుతున్న వైనం.
– పశువులు సైతం గాయపడుతున్న దౌర్భాగ్యం.
– యువతలో సన్నగిల్లుతున్న క్రమ శిక్షణ
కరకగూడెం, జూన్27(జనం సాక్షి):
మండలంలో యువకుల ఆనందం కోసం మద్యం సేవించి సీసాలు రైతుల పొలాల్లో పగలగొట్టడంతో ఎక్కడ చూసినా సీనం పెంకులే దర్శనమిస్తున్నాయి. ఆ యువకుల ఆనందం చుట్టూ ప్రక్కల రైతులకు శాపంగా మారింది. రైతులు ఇచ్చిన వివరాల ప్రకారం కరకగూడెం చుట్టూ ప్రక్కన ఉన్నగ్రామాలకు చెందిన రైతులు వారిఆవేదన “ జనం సాక్షి “కి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రేగాళ్ల వెళ్లే రోడ్డులో రైతుల పొలాలకు ఆనుకొని ఉన్న ఓ బెల్ట్ షాపు ఏర్పాటు చేశారు. అక్కడ మద్యం సేవించేందుకు వచ్చిన యువకులు మద్యం కొనుగోలుచేసి ఆ షాపుకు కూత వేటు దూరంలో ఉన్న పొలాల్లో ఉన్న చెట్ల క్రింద మద్యం సేవించి తాగిన మైకంలో యువకులు కూర్చున్న స్థలం వద్ద చెట్ల కింద సీసాలు చిందరవందరగా పడేస్తున్నారు. అలాగే గ్రూపులు గ్రూపులుగా కూర్చొని తాగురూ. వివాదాలు జరుగుతున్న క్రమంలో చూసినా సీసం పెంకులు ఉన్నాయని రైతులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాన్ని దున్నేందుకు. నాట్లు వేసేందుకు,కూలీలు రారేమోనని ఆందోళన చెందుతున్నారు. పశువులు సైతం ” ఎండా కాలం కావడంతో ” చెట్ల నీడకు సేద తీర్చుకునేందుకు వచ్చిన పశువులు కాళ్లకు గాజు పెంకులు గుచ్చుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు పొలంలో ఉన్న గాజు పెంకులు తొలగించినట్లు తెలిపారు. యువకులకు ఎన్నిసార్ల తెలిసిన ,పట్టించుకోకపోవడంతో పాటు మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు రైతు ఆవేదన చెందుతున్నారు. చేసేదేమీలేక వంద సంవత్సరాలకు పైబడిన రావి చెట్లు, మర్రి చెట్లను సైతం నరికి వేస్తున్నట్లు తెలిపారు. అదంతా ఇక్కడ బెల్ట్ షాపు ఏర్పాటు చేయడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతుల పొలాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో బెల్ట్ షాపును అక్కడ నుంచి వేరే వద్దకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే .
(ఇట్టి విషయం పై స్థానిక ఏఎస్ఐ ని వివరణ కోరగా ఇలా సమాధానమిచ్చారు.)
నేటి నుంచే నైట్ పెట్రోలింగ్ చేస్తాం.పెట్రోలింగ్ లో ఎవరన్నా పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరనిచ్చారు.
ReplyForward
|