యువత జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్రం..
– పార్లమెంట్లో చర్చించకుండా అగ్నిపథ్ జీవోను ఎలా తీసుకొస్తారు?
– అభ్యర్థులపై పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలి..
– భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి టౌన్, జూన్ 27 (జనంసాక్షి):
అగ్నిపథ్ జీవోను పార్లమెంట్ లో చర్చించకుండా ఆగమేఘాలమీద తీసుకువచ్చి యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు.సోమవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో అగ్నిపథ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి
గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. అగ్నిపథ్ పై కేంద్రం పార్లమెంట్లో చర్చించకుండా యువత జీవితాలతో చాలగటం అడుతున్నారని ఆరోపించారు. మోడీ ప్రతి పథకం కూడా ఆధాని, అంబానీలు కోసమే తీసుకొస్తున్నట్లు మండిపడ్డారు. శ్రీలంకలో కూడా మోడీ ఆధానికి సహకరించేలా ఒత్తడి చేస్తున్నారని అన్నారు. అగ్నిపథ్ తో సైనికుల వ్యవస్థను కాంట్రాక్టు పద్ధతి చేస్తున్నారు. దేశ భద్రత ను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని 4 సంవత్సరాల వరకే తీసుకోవడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంతో అగ్ని వీర్ లకి నాలుగు సంవత్సరాలు తరువాత రోడ్డు మీద పడడమే అన్నారు.
తెలంగాణ పోలీసులు ఖానాపూర్ మండలానికి చెందిన రాకేష్ అనే విద్యార్థి ని కాల్చి చంపితే., ఆ విద్యార్థి శవానికి వాళ్ళ జెండా వేసే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఈ విషయములో కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఇది అగ్నిపథ్ కాదు అగ్నిపరీక్ష అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం హడావిడిగా అగ్ని పత్ పథకం తీసుకు రావడం వలన దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని, నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొంది. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారు దీనివల్ల కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలి పోతాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటించిన మరు క్షణమే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అప్పటికప్పుడు పెద్దయెత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయంటే ఈ పథకం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతున్నది. ఈ రీత్యా అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రతినిధి అజ్మీరా జంపన్న ,పసునూటి రాజేందర్, 𝚂𝚃 జిల్లా చైర్మన్ పోరిక సమ్మన్న , మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు సుంకరి రామ్ చంద్రయ్య ,నర్సయ్య, కుమారస్వామి,, గూట్ల తిరుపతి రెడ్డి, జోగి బుచ్చయ్య , బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు భువన సుందర్, సుదర్శన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య, పోనకంటి శ్రీనివాస్, అప్పాల శ్రీను,మహేష్ రెడ్డి, బాలరాజు , కంకల మధు, కేతీరి సుభాష్, చారి, k.రాజన్న, కంచర్ల సదానందం నోముల రాకేష్, షేక్ ఇజాజ్, సంతోష్, ఇప్పాల రాజేందర్ ,అంబాల శ్రీను, నుగునూరి రజినీకాంత్ గౌడ్ ,మహేందర్ ,వెంకటేష్, తక్కలపల్లి రాజు ,ఒద్దుల అశోక్ రెడ్డి, సాగర్ , రాజిరెడ్డి, పబ్బా ప్రశాంత్,పృధ్వి, బయ్యరా అశోక్ ,తోట రంజిత్, శ్రీలేక, సుజాత, భూపాలపల్లి పట్టణ సోషల్ మీడియా ఇంచార్జ్ పోల్సాని కరుణాకర్ రావు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,పార్టీ కార్యకర్తలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
3 Attachments
|
![]() |