యువత రాజకీయాల్లో ముందుండాలి

– తెరాస పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మనోహర్
అశ్వరావుపేట అక్టోబర్ 23( జనం సాక్షి ) యువత రాజకీయాల వైపు ముగ్గు చూపి ప్రజాసేవకు అంకితమై ఉండాలని తెరాస పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ జుజ్జూరు మనోహర్ అన్నారు. అశ్వరావుపేట లోని ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ యువకులు పాల్గొన్నారు.