యువత సైనికుల్లా పని చేయాలి..
– అభివృద్ది,సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం.
కరకగూడెం, ఆగస్టు27(జనంసాక్షి):
పార్టీ బలోపేతానికి యువత సైనికుల్లా పని చేయాలని,టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, మండల ఎంపీపీ రేగా కాళిక పేర్కొన్నారు.
శనివారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో యువజన విభాగం మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు గ్రామాల్లో ఉన్న ప్రజలకు చేరవేయాలని యువతకు సూచించారు.రానున్న రోజులల్లో టీఆర్ఎస్ పార్టీలో యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు.సోషల్ మీడియా సభ్యులు టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రేగా కాళిక,మండల ప్రధాన కార్యదర్శి బుడగం రాము,మండల ఉపాధ్యక్షులు జాడి రామనాథం,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,అధికార ప్రతినిధి యాలిపెద్ది శ్రీనువాస రెడ్డి,
రేగా సత్యనారాయణ,సోషల్ మీడియా మండల అధ్యక్షులు
చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్,మండల యువజన నాయకులు గాందర్ల సతీష్,కంటెం నగేష్,ఎగ్గడి శ్రీనువాసు,కొమరం శంకర్,రామటెంకి పూర్ణ చందర్ శేఖర్,సిద్ది సునీల్,ఉప సర్పంచులు బోడ ప్రశాంత్,జాడి నాగరాజు,ఈసం సమ్మయ్య,గ్రామాల యువజన నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
|