యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న డొమినిక్‌ థీమ్‌


న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): డిఫెండిరగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం కాగా, స్వల్ప చికిత్స అనంతరం నొప్పి తిరగబెట్టింది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో వరల్డ్‌ నంబర్‌ 6 యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది బుడాపెస్ట్‌ (హంగేరీ)లో జరుగుతున్న వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ 150వ ర్యాంకర్‌ శ్రీజ 11-9, 11-6, 13-11తో ప్రపంచ 53వ ర్యాంకర్‌ బార్బొరా బలజోవా (స్లొవాక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఆమె భారత్‌కే చెందిన వరల్డ్‌ 60వ ర్యాంకర్‌ మనికా బాత్రాతో తలపడుతుంది.