యూత్ రెడ్‌క్రాస్ అధికారిగా సాంబమూర్తి
ఖమ్మం, నవంబర్ 8 ): ఖమ్మం జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అనుబంధ సంస్థ అయిన యూత్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ప్రోగ్రాం అధికారిగా ఖమ్మంలోని శారదా ఇంజనీరింగ్ కళాశాల పిజికల్ డైరెక్టర్ విఎస్‌ఎస్ సాంబమూర్తిని నియమించినట్టు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జయచంద్రారెడ్డి తెలిపారు. సాంబమూర్తి ఐదు సంవత్సరాలుగా అనేక రక్తదాన శిబిరాల్లో పాల్గొని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారని, ప్రతి ఏటా 200 యూనిట్ల రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నారని జయచంద్రారెడ్డి తెలిపారు.