యూత్ కాంగ్రెస్ మండల కార్యకర్తల సమీక్ష సమావేశం
హుజూర్ నగర్ సెప్టెంబర్ 19 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో హుజూర్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కడపు మహేష్ గౌడ్ అధ్యక్షతన మఠంపల్లి మండల కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలో తీసుకు రావడానికి యూత్ కాంగ్రెస్ పాత్ర చాలా ప్రాధాన్యంతో కూడుకుందని, గతంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న రోజుల్లో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు మీరందరూ యువకులని మీరు కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరికి పార్టీ లో సరైన గుర్తింపు లభిస్తుందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ముందుండి పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతం చేయటం కోసం ఎటువంటి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా పనిచేయాలని, మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీ ఉత్తమన్నగా మీకు అండగా ఉంటానని యూత్ కాంగ్రెస్ నాయకులకు భరోసా ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ గౌరవ సలహాదారులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు, మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య మంజు నాయక్, మఠంపల్లి మండల యూత్ అధ్యక్షులు తెల్లబోయిన శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షులు కందుల వినయ్, ప్రచార కార్యదర్శి కస్తాల రవీందర్, హుజూర్నగర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేడపంగు రాము, గరిడేపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చలకూరి కృష్ణ, హుజూర్నగర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిరంజీవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాములు శివారెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు, జిల్లా నాయకులు బచ్చలకూరి బాబు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు రాజశేఖర్ రెడ్డి, మఠంపల్లి మండల లోని అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.