యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా మహిళలు తీసుకున్న బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించి కొత్త రుణాలు తీసుకోండి : కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 10 : బుధవారం కల్లెక్టరేట్ సమావేశంహాలులో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వారి అద్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల మెగా రుణమేళా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన గావించి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మెగారుణ మేళా రుణాలను 7 మండలాల లో 152 మహిళా గ్రూప్ లకు 5 బ్రాంచ్ ల నుండి 11 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మంజూరు చేసిన రుణాలను సకాలంలో నిర్దేశించిన సమయానికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. తీసుకున్న ఋణం సద్వినియోగం చేసుకొని అభివృది పథం లో ముందుండాలని అన్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజినల్ మేనేజర్ జి ఎన్ వి రమణ మాట్లాడుతూ బ్యాంకు ద్వారా మంజూరు అయిన రుణాలను సకాలంలో చెల్లిస్తే కొత్త రుణాలు తీసుకొనుటకు వీలు ఉంటుందని, కొత్త గ్రూప్ లను పరిచయం చేస్తే 20 లక్షలు అయిన ఇవ్వడానికి మా బ్యాంక్ లు సిద్దంగా ఉన్నాయన్నారు. జిల్లా సమైక్య సంఘాలకు 11 కోట్ల చెక్కును కలెక్టర్ గారి ద్వారా అందజేశారు. సహకారమందించినందుకు ఏ పి ఎం లకు, సి సి లకు బహిమతులు అందజేశారు. ఈ సమావేశంలో ఎల్ డి ఎం అయ్యపు రెడ్డి, ఇంచార్జి డి ఆర్ డి ఓ నాగేంద్రం, అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ , ఎపి ఎం లు, సి సి లు తదితరులు పాల్గొన్నారు.