యూనివర్సిటీ పరిధిల్లో పరీక్షలు వాయిదా

అన్నిరకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు

హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బీటెక్‌, బీఫార్మాకు సంబంధించిన సెమిస్టర్‌ పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ రిజిస్టార్ర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు.. వాయిదా వేసిన పరీక్షలను 16వ తేదీ తర్వాత న్విహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా సోమ, మంగళ, బుధవారాల్లో ప్రైవేట్‌ కాలేజీలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌జలీల్‌ తెలిపారు.కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కూడా సోమ, మంగళవారాల్లో జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు మధుకర్‌, ఎ.నరేందర్‌ ప్రకటించారు. సోమవారం జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 2న, మంగళవారం జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల రెండో, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 3న, సోమవారం జరగాల్సిన బీసీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 13వ తేదీన, మంగళవారం జరగాల్సిన బీవో రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 21న, మంగళవారం జరగాల్సిన బీవో రెండో సెమిస్టర్‌ పరీక్ష ఈ నెల 21న, సోమవారం జరగాల్సిన బీవో నాలుగో సెమిస్టర్‌ పరీక్షను ఈ నెల 22న నిర్వహించ
నున్నట్లు పేర్కొన్నారు.