యూపీఏ అసమర్థత వల్లే పొరుగు దేశాల దుశ్చర్యలు
-భాజపా నేత వెంకయ్యనాయుడు
నల్గొండ : యూపీఏ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే పొరుగు దేశాలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఖమ్మం వెళ్తూ నల్గొండ జిల్లా సూర్యాపేటలో వెంకయ్య మీడియాతో మాట్టాడారు. చైనా దురాక్రమణపై గట్టిగా సమాధానం చెప్పకపోవడంతో మరింత భూభాగం అక్రమణకు గురవుతోందన్నారు. ఈ దేశంతో విదేశాంగ మంత్రి సంప్రదింపుల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాక్ పొట్టనబెట్టుకున్న సరబ్‌జిత్‌సింగ్ విడుదలకు కేంద్రం సరైన చర్యలు తీసుకోలేదని అరోపించారు. బొగ్గు కుంభకోణం వ్యవహారంలో ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వ జేబు సంస్థగా సీబీఐ మారిందని అరోపించారు.