యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్
శ్రీమద్దతు కోసం రంగంలోకి దిగిన ప్రధాని
శ్రీఒంటరైన మమత..
శ్రీములాయం, మాయావతి మద్దతు
శ్రీ యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఓకే
న్యూఢిల్లీ : రాష్ట్రపతి పదవికి యుపిఎ అభ్యర్ధిగా ప్రణబ్‌ముఖర్జి పేరును ఆ కూటమి అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రక టించారు. ప్రణబ్ అభ్యర్ధి త్వాన్ని యుపిఎ భాగస్వామ్య పక్షంలోని తృణ మూల్ మినహా అన్ని పార్టీలు బలపర్చాయి. ఇదిలా ఉండగా ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపర్చేం దుకు గాను ప్రధాని మన్మోహన ్‌సింగ్ రంగంలోకి దిగారు. అందరి మద్దతు కూడగట్టేం దుకు ఉపక్రమించారు. అన్ని పార్టీల నాయకు లకూ ఫోను చేసి మద్దతును కూడగడు తున్నారు. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు ఫోను చేసినట్టు తెలిసింది. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు కూడా ఫోన్ చేసి ఇదే విషయమై అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో బిఎస్‌పి నాయకు రాలు మాయావతి లక్కోలో విలేకరులతో మాట్లాడుతూ ప్రణబ్ అభ్యర్ధిత్వాన్ని బలప రుస్తున్నట్టు ప్రకటించారు. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం కూడా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఒంటరి అయినట్టు తెలుస్తోంది.
ప్రణబ్ అభ్యర్ధి త్వాన్ని యుపిఎ