రంగారెడ్డి డీసీఎంఎన్ అధ్యక్ష ఎన్నిక వాయిదా
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా డీసీఎంఎన్ అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నిక చివరి క్షణంలో వాయిదా పడింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి జోక్యంతో డీసీఎంఎన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానానికి నామినేషన్ వేసిన హోంమంత్రి వర్గీయులు, శ్రవణ్‌కుమార్, రత్నయ్యలు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. డీసీసీబీ ఎన్నికల్లో మాత్రం హోంమంత్రి వర్గీయులు లక్ష్మారెడ్డి, కృష్ణారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ స్థానానికి మాత్రం తమకు కేటాయించాల్సిందిగా తమ వర్గీయుడు ధారా సింగ్‌కు కేటాయించాల్సిందిగా జిల్లాకు చెందిన మరో మంత్రి ప్రసాద్‌కుమార్ పాటు ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌లు పట్టుబడతూ వచ్చారు. ఇందు కోసం సీఎం, పీసీసీ అధ్యక్షుడిపైనా ఒత్తిడి తీసుకురావడంతో చివరి క్షణంలో డీసీఎంఎన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది.