రక్తదానం చేసి ప్రాణదాతలమవుదాం
యువ చైతన్య యువజన సంఘం అధ్యక్షులు సాయి కృష్ణ
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : మండల కేంద్రంలోని యువ చైతన్య యువజన సంఘం అధ్యక్షులు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన సభ్యులు బత్తిని సాయి కృష్ణ జన్మదిన సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు సాయి కృష్ణ మిత్రులు యువ చైతన్య యూత్ సభ్యులు దాదాపు 40 మంది స్వచ్ఛందంగా రక్త దానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా సాయి కృష్ణ మాట్లాడుతూ
యువకులమంతా రక్తదానం చేసి ప్రాణదాతలం అవుదామని తన జన్మదిన సందర్భంగా తన మిత్రులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ప్రతీ ఒక్కరూ రక్త దానం చేయాలని అన్నారు