రక్తదానం ప్రాణదానంతో సమానం ఎంపీపీ శ్రీమతి వనజమ్మ

 మక్తల్ ఆగస్టు 17 : వజ్రోత్సవాలలో భాగంగా మక్తల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఎంపీపీ వనజమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. అనేక అత్యవసర పరిస్థితులలో దాతలిచ్చిన రక్తం ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు.  రక్తదాన ఆవశ్యకతను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో రక్తదానానికి ఒక రోజు కేటాయించడం చాలా సంతోషమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వజ్రోత్సవంలో భాగంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గానికి 75 మంది రక్తదాతలతో రక్తదాన శిబిరంలో పాలు పంచుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నేడు రక్త దానశిబిరం లో పాల్గొన్న ప్రతి ఒక్క యువకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రక్త దానం చేసిన యువకులకు ప్రతి ఒక్కరికి సెర్టిఫికేట్ లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ శైలజ, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి, డాక్టర్ పార్వతి, సిఐ సీతయ్య, ఎస్సై పర్వతాలు, శ్రీధర్ మరియు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు