రక్తదానం ప్రాణదానంతో సమానం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ శివశంకర్, రెడ్ క్రాస్ ఇంచార్జ్ మధుకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శనివారం స్థానిక కొత్త బస్టాండ్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని డిపోలలో భాగంగా ఈ రక్తదాన శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు.రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి సహాయం చేసిన వారు అవుతారని పేర్కొన్నారు.ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో తీవ్ర గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్నారని , అలాంటివారికి ఈ శిభిరాల ద్వారా సేకరించిన రక్తం ఆయుష్షును పోస్తుందని అన్నారు.రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ , సెక్యూరిటీ ఇంచార్జ్ దేవేందర్ రెడ్డి , స్టేషన్ మేనేజర్ నిర్మల , వెల్ఫేర్ మెంబర్ భాను, ఎస్ఎస్ గౌడ్, సుధాకర్, సిఆర్సి రవికుమార్, ఏకాంబరం, హెచ్ డీఎఫ్ సి బ్యాంక్ సిబ్బంది హరీశ్, శ్రీకాంత్ రెడ్డి,తేజ, కిరణ్, లింగయ్య, భాస్కర్, సతీష్, మురళి, మధు, సుమన్, నరేష్, రాజేష్, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.