రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి.

– బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్.
బెల్లంపల్లి, అక్టోబర్ 17, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ కోరారు. రోడ్డు ప్రమాద బాధితులు, తలసేమియా, సికిల్ సెల్, డెంగ్యూ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి బ్లడ్ బ్యాంకులో రక్త నిలువలు లేక పోవడం వల్ల మరణాలకు గురవుతున్నారని, అలాంటి వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని సూచించారు. ఈ రక్తదాన శిబిరానికి ప్రజాప్రతినిధులు, యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.