రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి డా సత్యం శ్రీరంగం

కూకట్ పల్లి జనంసాక్షి
ఈ రోజు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్బంగా శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాందేవ్ రావు హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ డా. సత్యం శ్రీరంగం, రాందేవ్ రావు హాస్పిటల్  సీఈఓ డా. యేబు , మెడికల్ డైరెక్టర్ డా. కమలాకర్ , డా. కల్పన  పాల్గొన్నారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ రక్త దానం చేయడం అంటే ఒక మనిషిని బ్రతికించడం అని, రక్త దానం ప్రాణ దానంతో సమానం అన్నారు. ఆపరేషన్ సమయంలో, రక్త హీనతతో బాధపడే వారికి, రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు అధిక సంఖ్యలో ఉంటున్నారని అటువంటి సమయంలో రక్తం విలువ ప్రాణంతో సమానం. కావున ఆరోగ్యవంతమైన వారు రక్త దానం చేసి అనేక లక్షల మంది ప్రాణాలను కాపాడాలని, అవగాహన కల్పించి, చైతన్య పరుచుటయే ఈ రక్తదాన దినోత్సవ పరమార్థం అన్నారు. ప్రతీ దేశంలో వారి అవసరాల మేరకు రక్తం నిలువ ఉండాలంటే రక్త దాతల సంఖ్య పెరగాలన్నారు. రక్త దానం చేయడం వల్ల ఏరకమైన అనారోగ్యాలు రావని, ఏమైనా అపోహలు ఉంటే తొలగించి రక్తదాతలను ప్రోత్సహించి అనేక మంది ప్రాణాలు నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్త దానం చేసిన వారు సత్యం శ్రీరంగం, శ్రీరంగం శ్రీసుధన్వ, శ్రీరంగం శ్రీసుమేద్, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న, మహేందర్, హేమంత్, శ్రీనివాస్, జహంగీర్, శంకర్, చంటి సింగ్, క్రిష్ణ చైతన్య, రమేష్, రాజు తదితరులు