రజకుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కు వినతిపత్రం

రఝునాధపాలెం సెప్టెంబర్ 28. జనం సాక్షి గతంలో రజకులకు మున్నేరు ప్రక్కన ధోబీఘాట్ కు కేటాయించిన స్థలంను సర్వే చేయించి హద్దులు పెట్టించి నగరంలోని రజకులందరికి ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని, అసంపూర్తిగా ఉన్న చెర్వు బజార్, రజక వీధీలలో రజక కమ్యూనిటీ భవన్ లను పూర్తి చేయుటకు నిధులు కేటాయించాలని. ఖమ్మం ట్యాoక్ బండ్ మీద చిట్యాల ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని, రజకులకు డీసీసీబీ బ్యాంక్ ద్వారా వ్యక్తిగత ఋణాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో బట్టలు ఉతికే కాంట్రాక్టు రజకులకే ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని, కరోనా సమయంలో సేవలందించిన రజకులను ప్రభుత్వం గుర్తించి వారిని గౌరవించాలని, ముదిరాజులను బీసీ’ఏ’ చేర్చే ఆలోచనను ప్రభుత్వం విరమించు కోవాలని, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అను పదాన్ని వాడకుండా ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ పేరును వాడుకలోకి తేవాలని ఆవినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు రేగళ్ల సీతారాములు, రేగళ్ల కొండలు, జక్కుల వెంకటరమణ, నగర కన్వీనర్ కనతాల నరసింహా రావు, కండ్రాతి వెంకటేశ్వర్లు, తంగేళ్లపల్లి శ్రీనివాస్, పంతంగి రవికుమార్, గోలి రామారావు, కొలిపాక వెంకట్, గడ్డం ఉపేందర్, రేగుముడి రామకృష్ణ, గుడికందుల వెంకన్న, కాకులహారం నరసింహా, వట్టికోట దర్గయ్య, మాచర్ల యాలాద్రి, వట్టికోట అప్పారావు, సట్టు శ్రీను, నేరళ్ల ఉపేందర్, నెరేళ్ల దర్గయ్య,లింగంపల్లి సైదులు, గడ్డం రాము, పావురాల ఉపేందర్, అక్కిపెళ్ళి మురళి, ఎదుళ్ల గోపి, గంగిసర్ప నాగ, భూమా రామారావు, కట్టంకురి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.