రసవత్తరంగా ప్లే ఆఫ్ రేస్
ముంబై ,మే 6 (జనంసాక్షి): ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీం… మరోసారి టైటిల్ సాధించేందు సై అంటోంది. ముంబై చేతిలో 60 పరుగులతో చిత్తుగా ఓడడం మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధిచింది. దీంతో మరోసారి ప్లే ఆఫ్‌కు చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక బెంగళూర్ – ముంబై లాంటి ఫేవరెట్ జట్లు కడా ఆ రేసులో దూసుకు వస్తున్నాయి… ఐ.పి.ఎల్‌ఆరో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్‌గా మారింది. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో విజయం సాధిచింది. ఓడిన మూడింటింటిలో రెండు సార్లు పోరాడి ఓడింది. ఒక మ్యాచ్‌లో చిత్తుగా చిత్తైంది. తాజాగా ముంబై చేతిలో 60 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. అయితే ఈ ఒక్క ఓటమిని చూసి చెన్నై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెటరన్ ఓపెనర్ మైకెల్ హస్సి సూపర్ ఫాంలో ఉన్నాడు. కెప్టెన్ ధోనీ చివర్లో మెరుపులు మెరిపిస్తూ జట్టు విజయాల్లో కీ రోల్ పోషిస్తున్నాడు. సరైన సమయంలో రైనా ఫాం అందుకున్నాడు. దీంతో చెన్నై ప్లే ఆఫ్ ఛాన్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మరో రెండు మూడు విజయాలు సాధిస్తే సరిపోతుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న బెంగళూర్ ఫాం చూస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుందని ఆశలు పెట్టుకోవచ్చు. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడినా ఆ జట్టు ఆటగాళ్లూ సూపర్ ఫాంలో ఉన్నారు. ముఖ్యంగా క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీల ఫాం బెంగళూర్ జట్టుకు అడ్వాంటేజ్ కానుంది. డివిలియర్స్ కూడా అవరసమైన సమయంలో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో వినయ్ కుమార్, ఆర్పీ సింగ్, రాంపాల్ అంతా బౌలింగ్ విభాంలో బాధ్యత తీసుకుంటున్నారు. వీరింతా మిగిలిన మ్యాచ్‌ల్లోనూ అంచనాలు అందుకుంటే ప్లే ఆఫ్‌కు తప్పక చేరుతుంది…
తొలి రౌండ్ ముగిసేపట్టికి రేసులో లేనట్టు కనిపించిన ముంబై ఇండియన్స్ కూడా ఇప్పుడు రేసులో దూసుకు వచ్చింది. రికీ పాంటింగ్ కెప్టెన్‌గా తప్పుకొని రోహిత్ శర్మకు ఛాన్స్ ఇవ్వడంతో ముంబై తలరాత మారింది. ఇప్పుడు వరస విజయాలు సాధిస్తోంది. తాజాగా హాట్ ఫేవరెట్ చెన్నైను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు మినహా అంతా ఫాంలో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ధనాధన్ అనిపిస్తూ జట్టు విజయాల్లో కీ రోల్ పోషిస్తున్నాడు. బౌలింగ్‌లో మిచెల్ జాన్సన్ ఫాం అదనపు అడ్వాంటేజ్. ఇక మలింగా, భజ్జీ, ఓజా అవసరాలకు తగ్గట్టు రాణిస్తున్నారు.
టోర్నీ ఆరంభానికి ముందు పెద్దగా అంచనాలు లేని రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్ రేసులో దూసుకువస్తోంది. ఐ.పి.ఎల్ తొలి సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ మళ్లీ ఇప్పుడు అదే పాం కంటిన్యూ చేస్తోంది. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో చెలరేగుతోంది. ఆసీస్ ఓపెనర్ షేన్ వాట్సన్ సూపర్ ఫాం.. రాహానె నిలకడగా రాణింపు ఆ జట్టుకు అడ్వాంటేజ్ అవుతోంది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా చెలరేగుతుండడం విశేషం. ఇక బౌలింగ్‌లో ఆస్టేల్రియా యువ పేసర్ ఫల్కనర్ ఫాం రాజస్థాన్‌ను రేసులో నిలిపింది. హైదరబాద్‌కు చెందిన సన్ రైజర్స్ కూడా సంచలన విజయాలతో రేసులో నిలిచింది. బ్యాటింగ్‌లో పెద్దగా స్టార్లు లేకున్నా అద్భుతమైన బౌలింగ్ విభాగంతో విజయాలు సాధిస్తోంది. లేటుగా జట్టులో చేరిన ఓపెనర్ ధావన్ కూడా చెలరేగుతున్నాడు. అమిత్ మిశ్రా జట్టుకు అదనపు ఆకర్షణ అయ్యాడు. ఇక పేసర్లు
ఇషాంత్, స్టెయిన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతున్నారు. స్థానిక ఆటగాడు విహారీ అవసరాలకు తగ్గట్టు ఆడుతున్నాడు. దీంతో సన్ రైజర్స్ కూడా ప్లే ఆప్ రేసులో ఉంది.. ప్రస్తతం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే పంజాబ్, కోల్‌కతా జట్లు రేసులో నిలవాలంటే వరస విజయాలు సాధించాల్సి ఉంది. ఢిల్లీ- పుణెలు ఇతర జట్ల ఫలితాలను ప్రభావం చేసేందుకు సై అంటున్నాయి…