రసాభసాగా సర్వసభ్య సమావేశం..

ఆసరా పింఛన్ల కోసం అర్హుల ఆందోళన.
– పనులు చేయకుంటే సర్పంచ్ సస్పెండ్ అంటారు.
– బిల్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తారు.
– ఇదెక్కడి న్యాయం సారు అంటున్న అధికార పార్టీ సర్పంచులు.
– ప్రభుత్వ సంపదను కాపాడేది రెవిన్యూనా.. పోలీసులా..?
– సమస్యల వెల్లువలో ముగిసిన సమావేశం.
ఊరుకొండ, అక్టోబర్ 22 (జనం సాక్షి):
ఊరుకొండ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభసాగా కొనసాగింది. శనివారం ఊరుకొండ ఎంపీపీ బక్క రాధజంగయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో
అధికార పార్టీ సర్పంచులు సైతం ప్రశ్నల వర్షం కురిపించారు. మండలంలోని వివిధ గ్రామాల అర్హులైన పింఛన్ రాని లబ్ధిదారులు తమకు పింఛన్ రాలేదంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. నర్సంపల్లి సర్పంచ్ వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. ఊర్కొండ మండలంలో ప్రభుత్వ సంపదను.. ప్రభుత్వ భూములను కాపాడేది రెవెన్యూ అధికారులా..? లేక పోలీస్ అధికారులా..? అనీ రెవెన్యూ అధికారులను నిలదీశారు. ఆర్ ఐ రాఘవేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల పైనే ఉందని.. మండల కేంద్రం నుండి అక్రమంగా ఇతర మండలాలకు మట్టి తరలిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బాల్యా లోక్య తండాకు చెందిన సర్పంచ్ శీను నాయక్, ముచ్చర్ల పల్లి సర్పంచ్ వీరెడ్డి పర్వత్ రెడ్డిలు మాట్లాడుతూ సర్పంచులను అభివృద్ధి పనులు చేయమంటున్నారు.. ఇల్లు కడుస్తున్న బిల్లులు మాత్రం పూర్తిస్థాయిలో మంజూరు చేయడం లేదు.. పనులు చేయకుంటే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేసి అభివృద్ధి పనులు చేయించిన తర్వాత బిల్లులు మంజూరు విషయంలో మాత్రం జాప్యం చేయడం వల్ల ఎంతోమంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. సర్పంచులను విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు సర్పంచులకు రావాల్సిన బిల్లుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికార పార్టీ సర్పంచులు ప్రశ్నల వర్షం కురిపించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంతోమంది అర్హులైన పింఛన్ లబ్ధిదారులు పింఛన్లు రాకపోవడంతో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. సర్వసభ్య సమావేశం మధ్యలోనే ఎంపీడీవో ప్రభాకర్ మధ్యలోనే బయటకు వెళ్లి ఆందోళన చేస్తున్న వారిని సర్ది చెప్పాలని చూసినా వారు వినకపోవడంతో .. వృద్ధుల అల్లరితో కూడిన గందరగోళం నడుమ.. సర్వసభ్య సమావేశం ముగిసింది. అనంతరం ఎంపీడీవో ప్రభాకర్ అర్హులైన వృద్ధులతో మాట్లాడి ప్రతి ఒక్కరూ దరఖాస్తు పెట్టుకోవాలని.. రెండు మూడు నెలల్లో సైట్ ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చేలా చూస్తారని భరోసా ఇవ్వడంతో అర్హులైన పింఛన్ లబ్ధిదారులు ఆందోళన విభజించారు. మొత్తం మీద సర్వసభ్య సమావేశం సమస్యల వెల్లువలో సమప్తమయింది.
కార్యక్రమంలో ఎంపీపీ బక్క రాధజంగయ్య, వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ రెడ్డి, కో ఆప్షన్ ఖలీల్ పాషా, సర్పంచులు వీరెడ్డి పర్వత్ రెడ్డి, తలసాని అనిల్ రెడ్డి, నిరంజన్ గౌడ్, ఆంజనేయులు, అనితనాగొజి, వనజ బాలస్వామి, సుదర్శన్, ఎంపీఓ వెంకటేష్,
ఎంపీటీసీలు ఈశ్వరమ్మ, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు