రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పది రోజులుగా వాటర్ ప్లాంట్ బంద్….
త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
ఎల్లారెడ్డిపేట (జనంసాక్షి) నవంబర్ 25 :ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గత 10 రోజులుగా పూరిఫైడ్ వాటర్ ప్లాంట్ మోటర్ రిపేరు కారణంగా టెండ్రర్ తీసుకొన్న వ్యక్తి షెటరును మూసి ఉంచాడు. గ్రామస్థులు త్రాగు నీటిని తెచ్చుకోవడం కోసం ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను అశ్రయిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో నడుస్తున్న వాటర్ ప్లాంటు ద్వారా బబుల్‌కు కెవలం మూడు రూపాయాలు కగా, ప్రైవేట్ వ్యక్తుల వద్ద బబుల్‌కు ఎనిమిది రూపాయాల నుండి పది రూపాయాల వరకు ఉంది. దింతో ప్రజలు ఎక్కువ డబ్బులతో పాటు, బస్టాండ్ దాటి వెళ్ళవల్సి వస్తుంది ప్లాంటును తెరిపించేందుకు గ్రామ అధికారులు తగు చర్యలు తీసుకొవాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు…