రాజకీయ పార్టీలకు అతీతంగా రుద్రూర్ బోనాల పండుగ

 

 

 

రుద్రూర్
బోనాల పండుగలో
ముచ్చటగా మూడు పార్టీలకు చెందిన నాయకులు

రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండలం కేంద్రంలో బోనాల పండుగ కన్నుల పండుగ సాగింది, ప్రతి సంవత్సరం లాగానే గ్రామ ప్రజలు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు బోనం. సమర్పించారు. ఈ బోనాన్ని కొత్తకుండలో వండి గ్రామ వీధుల గుండా అన్ని కులాలు వారు ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో బోనం సమర్పించారు. ఇది ఇలా ఉండగా ఈసారి ముచ్చటగా మూడు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజలతో మమేకమై సామరస్యంగా
రుద్రూర్ బోనాల పండుగలో బోనం ఎత్తుకొని గ్రామ దేవతలకు వద్దకు వెళ్లి ప్రజలు అందరు ఆయు ఆరోగ్యలతో ఉండాలని మొక్కుకున్నారు, ఈ బోనాల పండుగలో తెరాస బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి , బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి మాల్యాద్రి రెడ్డి , కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాలరాజు నేతలు పాల్గొన్నారు ,ముగ్గురు నాయకులు విడి విడిగా వారి వారి కార్యకర్తలతో, రుద్రూర్ మండల ప్రజలతో మమేకమై బోనాల పండుగను కన్నుల పండుగగా జరిపారు. జడ్పీటిసి నారోజి గంగారాం , అక్కపల్లి నాగేందర్, పత్తి లక్ష్మణ్, రుద్రూర్ సర్పంచ్ ఇందూర్ చంద్ర శేఖర్, గ్రామ యువకులతో కలిసి నృత్యాలు
చేశారు. ఈ కార్యక్రమంలో అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పీటీసీ నారోజి గంగారాం, రుద్రూర్ సర్పంచ్ ఇందూర్ చంద్ర శేఖర్,
తెరాస మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, మండల నాయకులు, అక్కపల్లి నాగేందర్, రుద్రూర్ వెంకటేశ్వర దేశాయి
తొట్ల గంగారాం, సంజీవ్ రెడ్డి, బి సంజీవులు, బీజీపీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, గజేందర్, కన్నె రవి, ప్రశాంత్ గౌడ్, వడ్ల నరేష్, గాండ్ల సాయిలు, తొట్ల శంకర్
ఇతర నాయకులు , గ్రామ పెద్దలు, కుల పెద్దలు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు