రాజగోపాల్ రెడ్డి,కెఎ పాల్ ఇద్దరూ ఒకటే
మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎద్దేవా
హైదరాబాద్,అగస్ట్6(జనం సాక్షి): ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్,తెలంగాణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మండిపడ్డారు. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. కేంద్రమంత్రి అమిత్‌షాను ఇద్దరు ఒకేసారి కలిశారంటే త్వరలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి చండూరు సభకు ఎందుకు హాజరు కాలేదో, అమిత్‌షాతో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి పనిచేశారని కాంగ్రెస్ నేత మల్లు రవి దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్
మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని మల్లు రవి ప్రకటించారు.