రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి):
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిందని,కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు,సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు అన్నారు.ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మునుగోడు మండలంలోని చీకటిమాడి గ్రామ ఉప ఎన్నికల ఇన్చార్జి సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణను సీఎం కేసీఆర్ విజయమార్గంలో నడిపిస్తున్నారని అన్నారు.దేశంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్‌ నాయకత్వంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.అన్ని వర్గాల వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు.పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు ఇక బారం కాకూడదని పథకాలు,రైతుల కన్నీళ్లు తుడిచేందుకు రైతు బంధు,వ్యవసాయ బోర్లకు మీటర్లు లేని మోటార్లు కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనం అన్నారు.టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు.ఈకార్యక్రమంలో వైస్ ఎంపిపి అనంత వీణలింగస్వామి, టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు జీడిమట్ల ధర్మయ్య,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాస్,టిఆర్ఎస్ పార్టీ,సిపిఐ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area