రాజయ్యకు తప్పని అసమ్మతి సెగ

అయినా ఆగని ప్రచార¬రు
జనగామ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఓ వైపు ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, వారి తరఫున ఇతర నేతలు ప్రచారం చేస్తున్నారు. అయినా చాపకింద నీరులా అసమ్మతి నేతలు పావులుకదుపుతున్నారు. మరికొందరు బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. స్టేషనట్‌ ఘనాపూర్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి  రాజయ్య ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు మద్దతుగా పల్లా రాజేశ్వర రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చేది లేదని చెబుతున్నా రాజయ్యకు అసమ్మతి బెడద తప్పడం లేదు. రాజయ్యను ఓడించడానికే వచ్చే ఎన్నికల్లో స్వతంత్య అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాజరపు ప్రతా ప్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు తన సహకారం లేదని ఖరాఖండిగా చెప్పారు. తాను మద్దుతగా ఉన్నానని ప్రచారం చేసుకోవడం తెలుపడం హాస్యస్పదమన్నారు.అనేక విధాలుగా నానా
ఇబ్బందులకు గురి చేసిన రాజయ్యకు మద్దతు తెలిపే ప్రసక్తేలేదని అన్నారు. తాను చేపట్టే కార్యక్రమాలు అడ్డుకోవడమే కాకుండా తన కార్యకర్తల పై కేసులు నమోదు చేయించే ప్రయత్నం చేసిన వ్యక్తికి సహకరించడం అనేది జరగదని తెలిపారు. తాను ఇండిపెండెంట్‌గా నిలుస్తున్నానని అన్నారు. అన్ని విధాల సహకారం ఉన్న రాజయ్య దమ్ముంటే తనపై గెలువాలని సవాల్‌ చేశారు. రాజయ్య లక్ష ఓట్లు వస్తాయని చెప్పుకోవడం కాదు డిపాజిట్‌ దక్కే అవకాశం లేదని అన్నారు. డబ్బుల ఎర చూపి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు అశీర్వదించే పరిస్థితి లేదని అన్నారు. జన బలంతోనే గెలుపొందుతానని అన్నారు. రాజయ్యకు సత్తా ఉంటే డబ్బులు పెట్టకుండా ఎన్నికల బరిలోకి రావాలని అన్నారు. ఇప్పటికే డిప్యూటి సిఎం కడియం మద్దతుదారులు పెద్ద ఎత్తున రాజయ్యకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కడియంను పోటీలో దిగాలని కోరారు. అయితే అధిష్టానం ఆదేవాల మేరకు నడుచుకోవాలని కడియతం తన అనుయాయులకు హితబోద చేశారు. మరొకసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిని చేస్తానని, తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాని రాజయ్య కోరారు. తన గెలుపుచూసిన సీఎం కేసీఆర్‌ తనకు డిప్యూటీసీఎం పదవి అవకాశం కల్పించారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నా కుటుంబంలాంటిందని అన్నారు.నియెజకవర్గంలోని కార్యకర్తలు సైనికులా పనిచేసి టీఆర్‌యస్‌ జెండాను మళ్లీ ఎగురవేసేలా,తనను లక్ష మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతీ కార్యకర్త కృషిచేయాలని వారు కోరారు.