రాజస్థాన్ లో దళిత విద్యార్థిని కొట్టి చంపిన అగ్రకుల టీచర్ ను బహిరంగంగా ఉరితీయాలి

మక్తల్, ఆగస్టు 17( జనం సాక్షి న్యూస్)

రాజస్థాన్ రాష్ట్రంలోని జల్లూరు జిల్లా సూరానా గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఇంద్ర కుమార్ మెగ్వాల్ 9 సం”రాల దళిత విద్యార్థి దాహం వేస్తుందని స్కూల్లో ఉన్న కుండలో నీటిని త్రాగడని విద్యార్థిని చావగొట్టిన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ జీర్గల్ నాగేష్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 167వ జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇంద్ర మెగ్వల్ కు నివాళులు అర్పించి భారీ ర్యాలీ ర్యాలీ నిర్వహిస్తూ తాసిల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేసారు. భారతీయ విద్యావ్యవస్థలోని కుల. మత. మతోన్మాదం తాము దళిత వ్యతిరేకులమని మరోసారి రుజువు చేసినాయి రాజస్థాన్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జూలై 20వ తేదీన ఈ ఘటన జరగా చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు భారతీయ విద్యా వ్యవస్థ ఇప్పటికీ పూర్తిగా బ్రాహ్మణీయంగానే ఉందని అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులను సామాజిక రుగ్మతలు నుండి విముక్తి పొందకుండా మినాయించింది రాజస్థాన్లో జరిగిన ఘటన కుల తత్వానికి. అంటరానితనానికి మరో ఉదాహరణ తప్ప మరొకటి కాదని భారత స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా విద్యార్థి మృతి చెందడం అత్యంత దారుణమని అన్నారు. మన దేశంలో స్వాతంత్రం పొంది 75 ఏళ్లు గడిచిన దళితులు. గిరిజనులు , బలహీన వర్గాలు వారికి నేటికీ స్వేచ్ఛ వాయువులు అందలేదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలి. మరణించిన విద్యార్థికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తున్నది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ గొల్లపల్లి జ్ఞాన ప్రకాష్ ,ఎమ్మార్పీఎస్ నాయకులు జి నారాయణ, బీఎస్పీ నాయకులు అర్జున్ రాజ్, కే ఎన్ పి ఎస్ విజయ్ కుమార్ ,అడ్వకేట్ దత్తాత్రేయ గారు, ఎమ్మార్పీఎస్ నాయకులు రవిప్రసాద్ ,శ్రీను, దీపక్, ఎమ్మార్పీఎస్ నాయకులు గుడిసె వెంకటయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.