రాజాపురం గ్రామంలో సురక్షా పోలీస్ కళాబృందం మూడనమ్మకాలపై కళా ప్రదర్శన.
కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 02 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో గత మూడు నెలలుగా వివిధ కారణాలతో 25 మంది మరణించిన సందర్భంగా గ్రామ ప్రజలు భయాందోళనకు గురై చేతబడులు భానుమతులు మరియు గ్రామానికి ఏదో చీడపీడ తగిలిందని అపోహలతో ఊరి బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్న తరుణంలో నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వారి ఆధ్వర్యంలో సురక్ష పోలీస్ కళాజాత బృందం వారిచే మూఢనమ్మకాలపై ప్రజలకు కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కోడేరు ఎస్సై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ కారణాలతో మరణించిన విషయం బాధగానే ఉంది కానీ మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు నమ్మకూడదని అదేవిధంగా చిన్నపిల్లలకు బైకులు డ్రైవింగ్కు ఇవ్వకూడదని మన గ్రామాల యువకులు బైకులపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అదేవిధంగా బైకు నడిపే వారు మద్యం సేవించి బైకు నడప రాదని ఎస్ఐ నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ మూఢనమ్మకాలపై ఒకవేల చేతబడులు బాణామతులని మీకు మీరే శిక్షలు విధించుకుంటే కచ్చితంగా వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై నరేందర్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. సురక్ష పోలీస్ కళాజాత బృందం వారు మూఢనమ్మకాలపై పాటలు పాడుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోడేరు ఎస్సై నరేందర్ రెడ్డి, మరియు సురక్ష పోలీస్ కళాబృందం సభ్యులు, పాండు, శ్రీను రవి తదితరులు పాల్గొన్నారు.