రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి

కోడేరు బీఎస్పీ మండల కన్వీనర్ ఎం రాము.

కోడేరు జనం సాక్షి జూలై   నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని నేడు తలపెట్టిన రిలే నిరాహార దీక్షకు డిఎస్పి గా మా మద్దతు ప్రకటిస్తూ కోడేరు మండల డీఎస్పీ కన్వీనర్ రాము తెలిపారు. మబ్బు రాము మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేస్తున్న మండలాలలోభాగంగా కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ మండల కన్వీనర్ మబ్బు రాము శీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రస్తుతం కోడేరు మండలం గా ఉన్నది, కోడేరు మండల కేంద్రానికి వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు విద్యార్థులు మండల కేంద్రంలో ఉన్న కాలేజీలకు విద్యార్థులు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేకపోవడం వంటి చాలా సమస్యలు రాజాపూర్ గ్రామంలో ప్రజలకు ఎదురవుతున్నాయి కాబట్టి అర్ధరాత్రిలో ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎవరైనా మండల కేంద్రం హాస్పిటల్ కు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉందని అందుకే రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా గతంలో రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని నిరసనలు రిలే నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తారోకోలు అర్థ నగ్న ప్రదర్శనలు ఎన్ని చేసినా కొల్లాపూర్ రాజకీయ ప్రజా ప్రతినిధుల లో చలనం లేకపోయిందన్నారు. అందుకే రాజాపూర్ గ్రామాన్ని నూతన మండలం గా ఏర్పాటు చేయాలని నేటి నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టిన గ్రామ ప్రజలకు బహుజన సమాజ్ పార్టీ తరపున మా మద్దతు ప్రకటిస్తున్నట్లు మేము కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొంటామని వారు ప్రకటించారు.